రేవంత్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ గురించి శుభవార్త – పెండింగ్ రుణాలను మాఫీ విధివిధానాలు
రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఆగస్టు 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రైతుల రుణమాఫీ అమలుకు సంబంధించిన విధివిధానాలను అధికారికంగా ఆమోదించనున్నారు. వచ్చే ఐదేళ్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలపై మంత్రివర్గంలో చర్చించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ కసరత్తు
రైతు రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి, అధికారులు రుణమాఫీ వివరాలను సేకరించారు. 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ పలుచోట్ల హామీ ఇచ్చారని, దీనికి సంబంధించి ముందస్తు కసరత్తు కూడా పూర్తయింది.
మార్గదర్శకాలు సిద్ధంగా ఉన్నాయి
April 1, 2019 నుంచి Dec 10, 2023 వరకు రైతులు తీసుకున్న Loans మాఫీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలాన్ని ప్రభుత్వం పంట రుణాల మాఫీ కాలంగా నిర్ణయించింది. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతోనూ చర్చలు జరిపారు. ఆ దిశగా ప్రభుత్వం రుణమాఫీ చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. అమలు మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే సూత్రప్రాయ నివేదికను సమర్పించారు. దీనిపై ఈనెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోదించనున్నారు. రుణమాఫీ చేసినప్పుడు, అది కుటుంబంలోని ఒక సభ్యునికి మాత్రమే వర్తిస్తుంది.
18న అధికారిక ఆమోదం
తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ సొమ్ము నేరుగా రైతు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖల ద్వారా కార్పొరేషన్‌కు తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. కొంత మంది రైతులు బ్యాంకు రుణం రెన్యూవల్ చేసుకోలేదు. వారికి మినహాయింపు వర్తిస్తుందా లేదా అనేది చూడాలి. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకర్లను సంప్రదించింది. రుణమాఫీ ద్వారా మరింత మందికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన పద్ధతులపై ఉత్సుకత నెలకొంది.